Rajnath Singh : మహిళల భద్రతకు ఇంకా ఎంతో చేయాలి : రాజ్ నాథ్​ సింగ్

Rajnath Singh : మహిళల భద్రతకు ఇంకా ఎంతో చేయాలి : రాజ్ నాథ్​ సింగ్
X

దేశంలో మహిళల భద్రత కోసం ఇంకా ఎంతో చేయాల్సి ఉందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. ఈ దిశగా ప్రభుత్వం తీవ్ర యోచన చేస్తోందన్నారు. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా ఆయన పోస్టు పెట్టారు.‘అత్యాచారం వంటి నేరాలకు మరణశిక్ష విధించేలా చట్టాలను సవరించాం. ఆ చట్టాలను కఠినంగా అమలుచేయాలి. దేశంలో మహిళలపై జరుగుతోన్న అఘాయిత్యాలు, నేరాలు చూస్తుంటే.. ఇంకా చేయాల్సింది ఎంతో ఉందనిపిస్తోంది. మహిళలపై జరుగుతోన్న నేరాలపై కేంద్ర ప్రభుత్వం కఠిన వైఖరిని అవలంబిస్తోంది. ఆ దిశగా కొన్ని రాష్ట్రాలు చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదు. ఇటీవల కోల్‌కతాలో జరిగిన ఘటన అమానవీయమైనది’అని రాజ్ నాథ్​ సింగ్ ట్వీట్ చేశారు.

Tags

Next Story