Rameshwaram Cafe Blast Case : ఇద్దరు ప్రధాన నిందితులు అరెస్ట్

రామేశ్వరం కేఫ్ పేలుళ్ల కేసు దర్యాప్తులో పెద్ద అప్‌డేట్ వచ్చింది. ఈ కేసులో ఇద్దరు ప్రధాన అనుమానితులను పశ్చిమ బెంగాల్‌లో NIA అదుపులోకి తీసుకుంది. పశ్చిమ బెంగాల్‌లో ఐఈడీ పేలుడుకు పాల్పడ్డారని ఆరోపించిన ఎంముస్సావీర్ హుస్సేన్ షాజిబ్, అతని సహచరుడు అబ్దుల్ మతీన్ తాహాను NIA అదుపులోకి తీసుకుంది.
ANI నివేదిక ప్రకారం, NIA ఒక ప్రకటన విడుదల చేసింది. “రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో పరారీలో ఉన్న అద్బుల్ మతీన్ తాహా, ముస్సావిర్ హుస్సేన్ షాజేబ్‌లను కోల్‌కతా సమీపంలోని వారి రహస్య స్థావరంలో గుర్తించి, NIA బృందం పట్టుకుంది. ముస్సావిర్ హుస్సేన్ షాజీబ్. కేఫ్‌లో IEDని ఉంచిన నిందితుడు, అబ్దుల్ మతీన్ తాహా ప్రణాళిక, పేలుడు అమలు.. తరువాత చట్టం బారి నుండి తప్పించుకోవడం వెనుక ఉన్న సూత్రధారి."
రామేశ్వరం కేఫ్ పేలుళ్ల కేసులో పరారీలో ఉన్న అద్బుల్ మతీన్ తాహా, ముస్సావిర్ హుస్సేన్ షాజేబ్‌లను కోల్‌కతా సమీపంలోని వారి రహస్య స్థావరంలో గుర్తించి ఎన్‌ఐఏ బృందం అదుపులోకి తీసుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com