RBI : ఆర్బీఐ కీలక నిర్ణయం..తగ్గిన రెపోరేటు

RBI : ఆర్బీఐ కీలక నిర్ణయం..తగ్గిన రెపోరేటు
X

ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. మానిటరీ పాలసీ కమిటీ ఈ రోజు జరిగిన సమా వేశంలో రెపో రేటును 25 బేస్ పాయింట్స్ ను తగ్గించింది. ఈ నిర్ణయం ఏకగ్రీవంగా తీసుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. తాజా తగ్గింపుతో రెపోరేటు 6.25%గా నిర్ణయించబడింది. 5 ఏళ్ల తర్వాత ఆర్బీఐ రెపోరేటును తగ్గించింది. రెపోరేటు తగ్గింపు కారణంగా హోంలోన్స్, పర్సనల్ లోన్స్ పై పట్టీ తగ్గే అవకాశం ఉంది. రెపో రేటు తగ్గింపుతో బ్యాంకులు తక్కువ వడ్డీ రేటు వద్ద రిజర్వ్ బ్యాంక్ నుంచి రుణాలు పొందుతాయి. దీని వల్ల బ్యాంకులు సాధారణ వినియోగదా రులకు అందించే రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించే అవకాశముంది. రెపోరేటు తగ్గింపు నేపథ్యంలో దేశీయ మార్కెట్ స్పందనపై ఆర్థిక రంగం దృష్టి సారించింది.

రెపో రేటు అంటే

ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు. రెపో రేటు పూర్తి రూపం రీపర్చేజ్ అగ్రిమెంట్ లేదా రీపర్చేజింగ్ ఆప్షన్. బ్యాంకులు అర్హత కలిగిన సెక్యూరిటీలను అమ్మడం ద్వారా ఆర్బీఐ నుంచి రుణాలు పొందుతాయి. బ్యాంకుల దగ్గర నిధులు తక్కువగా ఉన్నప్పుడు, లేదా అస్థిర మార్కెట్ పరిస్థితులలో లిక్విడిటీని కొనసాగిం చాల్సిన అవసరం వచ్చినప్పుడు ఇలా చేస్తాయి. మార్కెట్లో డబ్బు ప్రవాహాన్ని నియంత్రించడాని కి, పెంచడానికి రిజర్వ్ బ్యాంకు రెపో రేటును ఉపయోగిస్తుంది. ద్రవ్యోల్బణం మార్కెట్ పై ప్రభావం చూపినప్పుడు ఆర్బీఐ రెపో రేటును పెంచుతుంది.

Tags

Next Story