BJP : అయోధ్యలో బీజేపీ ఓటమికి కారణమేంటి?

BJP : అయోధ్యలో బీజేపీ ఓటమికి కారణమేంటి?

రామమందిర నిర్మాణంతో అయోధ్య ( Ayodhya ) దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. ఇప్పుడు ఆ అసెంబ్లీ సెగ్మెంట్ ఉన్న ఫైజాబాద్‌ పార్లమెంట్ స్థానంలో బీజేపీ ( BJP ) ఓటమి చర్చనీయాంశమైంది. ఇక్కడ తమ అభ్యర్థి అవధేష్ గెలుపు కోసం SP అధినేత అఖిలేశ్ యాదవ్ చాలా గ్రౌండ్ వర్క్ చేశారు. 22 శాతం OBC(యాదవులు, కుర్మీలు)లు, దళితులు(21%), ముస్లిం(18%)లను ఏకతాటిపైకి తీసుకొచ్చారు. బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు ఉండవనే అంశాన్ని బలంగా తీసుకెళ్లారు.

అయోధ్యలో ఓటమికి బీజేపీ చేసిన తప్పులు కూడా ఓ కారణం. టెంపుల్ సిటీ అభివృద్ధి కోసమని స్థలాలను తీసుకున్న ప్రభుత్వం నష్టపోయినవారికి పరిహారం ఇవ్వలేదు. రామ మందిర నిర్మాణం వల్ల వ్యాపారవేత్తలు, స్థానికేతరులే లాభపడ్డారని కోపంగా ఉన్న లోకల్స్ ఓటు రూపంలో నిరసన తెలిపారు. ఆ పార్లమెంట్ సెగ్మెంట్‌లోని 5 అసెంబ్లీ స్థానాల్లోనూ ఇదే పరిస్థితి. సిట్టింగ్ MP లల్లూ సింగ్‌పై వ్యతిరేకత, INC ఓటు బ్యాంకు కూడా SPకి కలిసొచ్చింది.

Tags

Next Story