Karnataka : మనీలాండరింగ్ కేసులో డీకే శివకుమార్ కు ఊరట

Karnataka : లోక్ సభ ఎన్నికలకు ముందు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు ఉపశమనం లభించింది. ఆయనపై నమోదైన మనీలాండరింగ్ కేసును సుప్రీంకోర్టు. మంగళవారం కొట్టివేసింది. ఈకేసుకు సంబంధించిన దర్యాప్తును నిలిపివేయాలని ఈడీని ఆదేశించింది. పన్ను ఎగవేత, కోట్ల విలువైన హవాలా . లావాదేవీల ఆరోపణలపై 2018లో ఈకేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా కాంగ్రెస్ నాయకుడిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు 2019 సెప్టెంబర్లో అరెస్టు చేశారు.
ఆ తర్వాత నెల రోజులకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిం ది. 2017లో డీకే నివాసాలు, అతని సహాయకులకు సంబంధించిన ప్రాంగణాల లో ఆదాయపు పన్నుశాఖ దాడులు చేసింది. ఈ దాడుల్లో రూ.300 కోట్లు దొరికా యి. దీనిపై డీకే స్పందిస్తూ, బీజేపీ రాజకీయ కక్ష్యకు పాల్పడుతోందని, న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందని గతంలోనే చెప్పారు.
తాజాగా సుప్రీం తీర్పుపై మాట్లాడుతూ, కేంద్రఏజెన్సీలను దుర్వినియోగం చేస్తూ బీజేపీ తనను వేధించిం దన్నారు. సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పు నిజంగా పెద్ద ఉపశమ నం. నేను చాలా కాలం ఇబ్బందిపడ్డాను. చివరకు సత్యం.. న్యాయమే గెలిచింది. ఈ రోజు నా జీవితంలో గొప్ప రోజు అని సంతోషం వ్యక్తంచేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com