Smriti Irani : స్మృతి ఇరానీకి రిలీప్.. పరువునష్టం కేసు కొట్టివేత

Smriti Irani : స్మృతి ఇరానీకి రిలీప్.. పరువునష్టం కేసు కొట్టివేత

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి (Smriti Irani) రిలీఫ్ దక్కింది. ఆమెపై షూటర్ వర్తికా సింగ్ వేసిన పరువునష్టం పిటీషన్‌ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. లక్నో బెంచ్ ఈ కేసులో తీర్పును ఇచ్చింది.

జర్నలిస్టులు వేసిన పిటీషన్‌కు కోర్టు స్పందిస్తూ, ఒకవేళ పిటీషనర్ కాంగ్రెస్ పార్టీకి చెందినా లేక గాంధీ ఫ్యామిలీకి చెందినా, అది పరువునష్టం కేసు కిందకు రాదు అని బెంచ్ తెలిపింది. ఫయాజ్ ఆలమ్ ఖాన్‌కు చెందిన బెంచ్ ఈ తీర్పును ఇచ్చింది. మార్చ్ 5వ తేదీన వచ్చిన ఆ తీర్పును సోమవారం కోర్టు సైట్‌లో అప్‌లోడ్ చేశారు.

అంతర్జాతీయ షూటర్ వర్తికా సింగ్.. సుల్తాన్‌పూర్‌లోని ఎంపీ, ఎమ్మెల్యే కోర్టులో పరువునష్టం కేసును ఫైల్ చేశారు. 2022, అక్టోబర్ 21వ తేదీన స్పెషల్ కోర్టు ఆ కేసును రద్దు చేసింది. అయితే ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ పిటిషనర్ వర్తికా సింగ్ హైకోర్టును ఆశ్రయించారు. ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ లో కేంద్ర మంత్రి పర్సనల్ సెక్రటరీ గురించి అడిగిన ప్రశ్నకు మంత్రి స్మృతి స్పందించడం వివాదాస్పదమైంది. పిటీషనర్ కాంగ్రెస్ పార్టీ కీలుబొమ్మ అని, గాంధీ కుటుంబంతో ఆమెకు నేరుగా లింకులు ఉన్నట్లు ఆరోపించారు. అయితే ఆ ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో ఎక్కడ కూడా పిటీషనర్ పేరును మంత్రి స్మృతి ఇరానీ ప్రస్తావించలేదని కోర్టు తెలిపింది. మంత్రి స్మృతి ఇరానీ ఆ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కేవలం రాజకీయ పార్టీని విమర్శిస్తోందని, పిటీషనర్‌ను కించ పరచాలన్న ఉద్దేశం ఆమెకు లేదని బెంచ్ తన తీర్పులో తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story