Musician : గంగాధర శాస్త్రికి కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు

Musician : గంగాధర శాస్త్రికి కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు

ప్రతిష్టాత్మక కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డుకు ప్రముఖ గాయ కుడు, ప్రవచన కర్త, భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థపాకులు డాక్టర్ ఎల్వీ. గంగాధర శాస్త్రి (Gangadhara Shastry) ఎంపిక య్యారు. 2023 ఏడాదికి గాను సాంప్రదాయ సంగీత విభాగంలో శాస్త్రిని కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు వరిం చింది. కర్ణాటక శాస్త్రీయ సంగీతంతో భారతదేశపు ఆధ్యాత్మిక సారమైన భగవ ద్గీతలోని 700 శ్లోకాల్లో 108 శ్లోకాలను యథా తథంగా పాడడంతోపాటు మిగిలిన 594 శ్లోకాలను స్వీయ సంగీతంలో తెలుగు తాత్పర్య సహితంగా ఆయన గానం చేస్తున్నారు. ఆయన చేసిన భగవద్గీత శ్లోకాల సీడీ మాజీ రాష్ట్రపతి స్వర్గీయ ఏపీజే అబ్దుల్ కలాం చేతుల మీదుగా విడుదలైంది.

ఈ నేపథ్యంలో ఉత్తమ సమాజ నిర్మా ణ లక్ష్యంతో గీత ప్రచారాన్ని గంగాధరశాస్త్రికొనసాగిస్తూ వస్తున్నారు. ఈ నేప థ్యంలో ఆయన చేస్తున్న సంగీత సేవకుగాను కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది. ఇప్పటికే గంగాధర శాస్త్రీకి ఏపీ కళారత్న, మధ్యప్రదేశ్ ప్రభుత్వ మహర్షి పాణిని యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్లు లభించాయి. ఈ సందర్భంగా గంగాధరశాస్త్రీ మాట్లాడుతూ... భగవద్గీతను జాతీయ గ్రంథంగా ప్రకటించడంతోపాటు గీతను పాఠ్యాంశంగా చేర్చాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.

Tags

Next Story