BJP : ఎన్నికల బరిలో రాజవంశీయులు .. బీజేపీ నుంచి బరిలోకి!

BJP : ఎన్నికల బరిలో రాజవంశీయులు  ..  బీజేపీ నుంచి బరిలోకి!

ఎన్నికల బరిలో నిలవాలనుకునే రాజవంశీయులకు బీజేపీ ఓ మంచి వేదిక అయిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈసారి బీజేపీ (BJP) నుంచి 10 మంది లోక్‌సభ బరిలో ఉండటమే ఇందుకు కారణం. మైసూర్ రాజవంశీయుడు యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్‌ను మైసూర్ అభ్యర్థిగా బీజేపీ ఇటీవల ప్రకటించింది. 20ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ రాయల్ ఫ్యామిలీ మళ్లీ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తోంది. 2004లో ఓటమి అనంతరం వీరి కుటుంబం రాజకీయాలకు దూరమైంది.

రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్ నుంచి మేవార్ రాజకుటుంబానికి చెందిన మహిమా కుమారీ బరిలో నిలవనున్నారు. త్రిపుర ఈస్ట్ నుంచి కృతిసింగ్ దెబ్బార్మా (మాణిక్య రాజకుటుంబం).. ఒడిశాలో మాజీ ఎంపీ ఆర్కా కేసరీ డియో (కలహండి రాజకుటుంబీకులు) సతీమణి మాళవిక పోటీ చేయనున్నారు. బెంగాల్‌లో కృష్ణానగర్ నుంచి రాజమాత అమృతా రాయ్ నిలిచారు. వీరు పోటీ చేయడం ఇదే తొలిసారి. కాగా మరికొందరు ఇప్పటికే బీజేపీలో కొనసాగుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story