Bridge Collapse : ప్రారంభం కాకముందే కూలిన రూ.12 కోట్ల వంతెన

Bridge Collapse : ప్రారంభం కాకముందే కూలిన రూ.12 కోట్ల వంతెన
X

బీహార్లో ( Bihar ) ప్రారంభో త్సవానికి ముందే ఓ బ్రిడ్జి కూలిపోయింది. బీహార్లోని అరా రియాలో రూ.12 కోట్ల రూపాయలతో వంతెనను నిర్మిం చారు. అయితే వంతెన ప్రారంభోత్సవానికి ముందే కుప్ప కూలిపోయింది. సిక్తి, కుర్సకాంత బ్లాక్లను కలుపుతూ బక్రా నదిపై రూ.12 కోట్ల రూపాయల వ్యయంతో వంతెనను నిర్మించారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి నష్టం జరగలేదు. ఇందుకు ఫొటోలు, వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఏడాది మార్చిలో కూడా బీహార్లోని సుపాల్లో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోవడంతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. 10 మంది గాయపడ్డారు. కోసి నదిపై నిర్మిస్తున్న వంతెన స్లాబ్ కూలి పోవడంతో భేజా మరియు బకౌర్ మధ్య ఉన్న మరీచా దగ్గర ఈ ఘటన జరిగింది.

Tags

Next Story