Mohan Bhagwat : అఖండ భారత్ నిర్మాణానికి ఆర్ఎస్ఎస్ పిలుపు

కేంద్రంలో కొత్త సర్కారు కొలువు దీరడంతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కీలక పిలుపునిచ్చింది. దేశ నిర్మాణంపై దృష్టి సారించాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat ) అన్నారు. లోక్ సభ, పార్లమెంట్ ఎన్నికల నిర్వహణపై ఆయన మొదటిసారిగా స్పందించారు.
ప్రతి సమస్యకు రెండు కోణాలు ఉంటాయనీ.. ఏ సమస్యనైనా పార్లమెంట్లో రెండు కోణాల్లోనూ పరిశీలించాలని మోహన్ భగవత్ సూచించారు. ప్రతి అంశానికి రెండు వైపులా ఆలోచించాలని, ఒక పార్టీ ఒకవైపు ప్రస్తావిస్తే, ప్రతిపక్షం మరో వైపు ప్రస్తావన తేవాలని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ప్రక్రియ ద్వారానే సరైన నిర్ణయానికి రాగలమని భగవత్ అన్నారు. నాగ్ పూర్ లో జరిగిన ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో మాట్లాడిన భగవత్ కొత్త ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు సలహాలిచ్చారు.
ఎన్నికల ప్రక్రియ యుద్ధం కాదని, కేవలం పోటీ మాత్రమేనిని మోహన్ భగవత్ చెప్పారు. ఈ పోటీ అబద్ధాల ఆధారంగా ఉండకూడదన్నారు. మణిపూర్లో ఒక్కసారిగా అక్కడ తుపాకీ సంస్కృతి పెరిగిపోయిందని, ఈ సమస్యను ప్రాధాన్యతపై పరిష్కరించడం ముఖ్యమని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com