Maharashtra : ఎంవీఏ నుంచి తప్పుకొన్న సమాజ్‌వాదీ పార్టీ

మహావికాస్ అఘాడీ(MVA) నుంచి తప్పుకొంటున్నట్లు సమాజ్‌వాదీ పార్టీ (SP) ప్రకటించింది. ఉద్ధవ్ ఠాక్రే సన్నిహితుడు మిలింద్ నర్వేకర్ బాబ్రీ మసీదు కూల్చివేతను సమర్థించేలా ట్వీట్ చేయడమే దీనిక్కారణమని మహారాష్ట్ర SP అధ్యక్షుడు అబు అసీం అజ్మీ తెలిపారు. శివసేన(UBT) సైతం బాబ్రీ కూల్చివేతకు మద్దతిచ్చేలా పేపర్‌లో ప్రకటన ఇచ్చిందని గుర్తుచేశారు. మహారాష్ట్ర అసెంబ్లీలో సమాజ్‌వాదీ పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలున్నారు.
మహారాష్ట్రలో EVMల ట్యాంపరింగ్ జరిగిందని ఆరోపిస్తూ మహావికాస్ అఘాడీ ఎమ్మెల్యేలు నేటి ప్రమాణ స్వీకారోత్సవాన్ని బహిష్కరించారు. ‘గెలుపొందిన మా ఎమ్మెల్యేలు నేడు ప్రమాణం చేయరు. మాకు EVMలపై అనుమానాలు ఉన్నాయి. ప్రజాస్వామ్యం కూనీ అయింది’ అని శివసేన UBT అధినేత ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ‘ఫలితాలపై సందేహాలొస్తున్నాయి. మొత్తం ప్రక్రియ కళంకితమైంది. ఏదో తప్పు జరిగినట్టు ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారు’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయ్ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com