Sanjay Raut : కాంగ్రెస్ లోకి సంజయ్ రౌత్?.. జోరుగా చర్చ

Sanjay Raut : కాంగ్రెస్ లోకి సంజయ్ రౌత్?.. జోరుగా చర్చ
X

శివసేన యూబీటీ సీనియర్ నేత సంజయ్ రౌత్ త్వరలో పార్టీని వీడబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. మహారాష్ట్ర మంత్రి, బీజేపీ నేత నితీశ్ రాణె ఈ మేరకు మీడియా ముందు వ్యాఖ్యానించారు. ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలతో చర్చలు జరుపుతున్నారు. రౌత్ రాజ్యసభ పదవీకాలం ముగింపుదశకు చేరింది. అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన పార్టీ 20 స్థానాలు మాత్రమే గెలిచింది. పార్టీ భవిష్యత్ ఆశాజనకంగా లేదని గ్రహించిన సంజయ్ రౌత్ కాంగ్రెస్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అందుకోసం ఢిల్లీలోని ఓ నాయకుడితో సంప్రదింపులు జరుపుతున్నారు అని నితీశ్ రాణె ఆరోపించారు. సంజయ్ రౌత్ తన ఉద్దేశాన్ని అధికారికంగా ప్రకటించాలి అని నితీశ్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే మధ్య విభేదాలున్నాయని ఇటీవల సామ్నా పత్రికలో సంజయ్ రౌత్ చెప్పడం చర్చనీయాంశమైంది.

Tags

Next Story