Corona India: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. దాంతో పాటు మరో ముప్పు కూడా..

Corona India: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. దాంతో పాటు మరో ముప్పు కూడా..
Corona India: కరోనా వైరస్‌ మళ్లీ విజృంభిస్తోంది. ఫోర్త్‌ వేవ్‌ తప్పదేమోనన్న భయం ప్రజల్లో మొదలయ్యాయి.

Corona India: కరోనా వైరస్‌ మళ్లీ విజృంభిస్తోంది. కేసులు పెరుగుతుండటంతో ఫోర్త్‌ వేవ్‌ తప్పదేమోనన్న భయం ప్రజల్లో మొదలయ్యాయి. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాల్లో కేసులు సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీకి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇక తెలంగాణలోనూ చాలా మంది కొవిడ్ బారిన పడుతున్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు కూడా కొవిడ్ సోకింది.

వైరస్‌కు పుట్టినిల్లు అయిన కేరళలో వెస్ట్‌ నైల్‌ వైరస్‌ వ్యాప్తి జరుగుతుంది. అయితే ఈ వైరస్‌ సోకిన వారిలో 80 శాతం మందికి ఎలాంటి లక్షణాలు లేవు. కానీ వ్యాధి తీవ్రంగా సోకితే ప్రాణాలు పోవడం ఖాయమని వైద్యులు చెబుతున్నారు. ఈ వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే లక్షణం కాస్త తక్కువగా ఉంటుంది. ఇక ఉత్తరప్రదేశ్‌లో మంకీపాక్స్‌ వైరస్‌ కలకలం రేగింది. ఇప్పటికే ప్రపంచంలో 27 దేశాల్లో వేల సంఖ్యలో మంకీపాక్స్‌ కేసులు వెలుగుచూశాయి.

స్మాల్‌పాక్స్, చికెన్‌ పాక్స్‌ మాదిరిగానే మంకీపాక్స్‌ సోకితే జ్వరం, ఒళ్లు నొప్పులతో మొదలై శరీరం నిండా కురుపులు ఏర్పడతాయి. ఈ వ్యాధికి ప్రత్యేకంగా చికిత్స అంటూ ఏమీ లేదు. అయితే స్మాల్‌ పాక్స్‌కు ఇచ్చే టీకాలు మంకీపాక్స్‌కు సమర్థంగా పని చేస్తుందని వైద్యాధికారులు చెబుతున్నారు. మధ్యప్రదేశ్‌ను చికెన్‌పాక్స్‌ వణికిస్తోంది. మొత్తం ఏడు జిల్లాల్లో ఈ వ్యాధి బయటపడింది. ఇక తెలంగాణలో డెంగీ కేసుల పెరుగుదల కనిపిస్తుంది.

ప్రధానంగా హైదరాబాద్‌లోనే ఎక్కువగా డెంగీ కేసులు నమోదవుతున్నాయి. పగటి పూట దోమ కాటు వలన డెంగీ సోకుతుందని డాక్టర్లు అంటున్నారు. ఉన్నట్టుండి తీవ్ర జ్వరం, భరించలేని తలనొప్పి, కళ్లలో మంట, చర్మంపై దద్దుర్లు, కండరాలు, కీళ్లనొప్పులు, అధిక దాహం, బీపీ తగ్గుదల ఇవన్నీ డెంగీ లక్షణాలని.. ఇలా ఉంటే వెంటనే డాక్టర్ సంప్రదించాలని వైద్య నిపులు సూచిస్తున్నారు. దీనికితోడు వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు పంజా విసురుతున్నాయి. దీంతో బాధితులు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story