India : నకిలీ పాస్ పోర్టు, వీసా ఉంటే ఏడేళ్ల జైలు, రూ.10లక్షల ఫైన్

భారత్ తీసుకువస్తున్న కొత్త ఇమ్మిగ్రేషన్ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందిన తరువాత కఠిన శిక్షలు అమల్లోకి రానున్నాయి. నకిలీ పాస్ పోర్టు, వీసా ఉపయోగించి భారత్ కు వచ్చినా, భారత్ నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించి పట్టుబడితే 7 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 10 లక్షల రూపాయలు వరకు ఫైన్ విధిస్తారు. హోంశాఖ ఈ కొత్త ఇమ్మిగ్రేషన్ బిల్లును తీసుకువచ్చింది. మార్చి 11న ఈ బిల్లును లోక్సభలో ప్రవేశ పెట్టారు. దీని ప్రకారం హోటల్స్, యూని వర్శిటీలు, విద్యా సంస్థలు, హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్ విదేశీయుల గురించిన సమాచారాన్ని హోం శాఖకు ఇవ్వడం తప్పనిసరి. అనుమతులకు విరుద్ధంగా ఎక్కువ రోజులు ఇక్కడే ఉండే వారి గురించి పర్యవేక్షణకు ఇది ఉపయోగపడుతుందని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. వ్యక్తులు, సంస్థలకు కనీసం 2 సంవత్స రాల నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష, కనీసం లక్ష నుంచి 10 లక్షల రూపాయల వరకు జరిమానా విధించడం జరుగుతుందని బిల్లులో ప్రతిపాదించారు. కొత్త బిల్లులో పలు నిబంధనలను సరళీకరించారు. సమ కాలీన అవసరాలను తీర్చేందుకు ఎక్కవ ప్రాధానత్యత ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com