Encounter : ఛత్తీస్ గఢ్ లో భీకర ఎన్ కౌంటర్.. మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ

Encounter : ఛత్తీస్ గఢ్ లో భీకర ఎన్ కౌంటర్.. మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ
X

ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో 11 మంది మావోయిస్టులు మంగళవారం మధ్యాహ్నం మృతి చెందారు. ఈ విషయాన్ని ఐజీ సుందర్ రాజ్ వెల్లడించారు.

పరస్పర కాల్పుల్లో కొందరు మావోయిస్టులు, జవాన్లు గాయపడ్డట్లు తెలుస్తోంది. ధనంది-కుర్రేవాయ అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ చోటు చేసుకుందని ఐజీ తెలిపారు. అభుజ్మీద్ లోని ఖోకామెటా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న సమాచారంతో 1400 మంది భద్రతా దళాలు రంగంలోకి దిగి సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి.

ఈ ఆపరేషన్ జిల్లా రిజర్వ్ గార్డ్ పోలీసులతోపాటు స్పెషల్ టాస్క్ఫోర్స్, బీఎస్ఎఫ్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసు (ఐటీబీపీ) దళాలు సోమవారం సంయుక్తంగా అపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలోనే కూంబింగ్ నిర్వహించారు. మావోయిస్టులు భద్రతా బలగాలపైకి ఫైరింగ్ మొదలుపెట్టారని.. ఎదురుకాల్పుల్లో 11మంది మావోలు చనిపోయారని అధికారులు తెలిపారు.

Tags

Next Story