Haryana : హర్యానాలో బీజేపీ సర్కారుకి షాక్

హర్యానాలో రాజకీయం మారింది. బీజేపీకి మద్దతు ఉపసంహరించుకున్నారు ముగ్గురు ఎమ్మెల్యేలు. దీంతో హర్యానాలో బీజేపీకి షాక్ తగిలినట్టయింది.
ముఖ్య మంత్రి నయాబ్ సింగ్ సైనీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టు ముగ్గురు ఇండిపెండెంట్ ఎన్ఎల్ ఎలు మంగళవారం ప్రకటించారు. లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కి మద్దతుగా ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. హర్యానా మాజీ సీఎం, కాంగ్రెస్ నేత భూపీందర్ సింగ్ హందా, పిసిసి చీఫ్ ఉదయభాను సమక్షంలో ముగ్గురు ఇండిపెండెంట్ ఎన్ఎల్ఎలు సోంబీర్ సాంగ్యాన్, రణధీర్ గొల్లెన్, ధరంపాల్ కొండర్ ఈ విషయాన్ని వెల్లడించారు.
రైతులకు సంబంధించిన ఆందోళనతో పాటు పలు సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. కాంగ్రెస్ కు తాము మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు, సైనీ ప్రభుత్వంలో వీరు చేరలేకపోవడంతో అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. హర్యానాలోని బిజెపి ప్రభుత్వం మ్యాజిక్ ఫిగర్ కోల్పో యిందని, వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. హర్యానా అసెంబ్లీలో మొత్తం 90 మం టిఎమ్ఎల్ఎ సీట్లు ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com