JP Nadda : జేపీ నడ్డాకు షాక్.. భార్య కారు ఎత్తుకెళ్లిన దొంగలు..!

JP Nadda : జేపీ నడ్డాకు షాక్.. భార్య కారు ఎత్తుకెళ్లిన దొంగలు..!

ఓ జాతీయ పార్టీ అధ్యక్షుడి కారుకే రక్షణ లేకుండాపోయింది. బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా (JP Nadda) భార్య కారు చోరీ కావడం రాజకీయంగా తీవ్ర సంచలనం కలిగించింది. సౌత్ ఈస్ట్ ఢిల్లీలోని గోవింద్ పురి పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మార్చి 19న మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య చోరీ జరిగినట్లు తెలుస్తోంది.

డ్రైవర్ జోగిందర్ టొయోటా ఫార్చునర్ కారును సర్వీసింగ్ కోసం ఇచ్చారు. తర్వాత డిన్నర్ చేసేందుకు ఇంటి వద్ద కారును నిలిపాడు. అయితే ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కారును ఎత్తుకెళ్లారు. సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా చోరీకి గురైన కారు గురుగ్రామ్ వైపునకు వెళ్లినట్లు గుర్తించారు.

ఇప్పటి వరకు పోలీసు అధికారులు కారును ట్రేస్ చేయలేకపోయినట్లు తెలుస్తోంది. చోరీకి గురైన కారు హిమాచల్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్ నంబర్ కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story