Shocking News : బెంగళూరులో ఉద్యోగులకు షాకిచ్చిన బంపరాఫర్

Shocking News : బెంగళూరులో ఉద్యోగులకు షాకిచ్చిన బంపరాఫర్

బెంగళూరు లోని (Bangalore) పలు కంపెనీలు కొత్త పద్ధతి ఫాలో అవుతున్నాయి. నగరంలోని ప్రజారవాణా వ్యవస్థలను ప్రోత్సహించే దిశగా పలు చర్యలు ప్రారంభించాయి. ఉద్యోగులు ఆఫీస్ కు రావడానికి, మళ్లీ వెళ్లడానికి ప్రజారవాణాను వినియోగించుకుంటే వారికి ఆర్థిక ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. ఉద్యోగులు తమ రాకపోకలకు సింగిల్ ఆక్యుపెన్సీ ప్రైవేట్ వాహనాలను ఉపయోగిస్తే పార్కింగ్ కోసం వారి నుంచి అదనపు మొత్తాన్ని వసూలు చేస్తున్నాయి.

రీసెంట్ గా బెంగళూరు నగరంలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. ఉద్యోగులు సొంత వాహనాలు కొనుగోలు చేయడం, ఒక్కో ఇంట్లో ఒక్కక్కరికి ఒక్క కారు ఉండడం బెంగళూరులో కామన్ గా మారింది. ఈ పరిస్థితుల్లో పీక్ హవర్స్ లో బెంగళూరులో ట్రాఫిక్ వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. అందువల్ల ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ప్రభుత్వాలు నగరంలోని ప్రైవేటు కంపెనీల సాయం తీసుకుంటున్నాయి.

తమ ఉద్యోగులు ప్రజా రవాణాను ఉపయోగించుకునేలా చూడాలని కంపెనీలను ప్రభుత్వం కోరింది. దాంతో, కంపెనీలు ప్రజా రవాణాను ఉపయోగించే ఉద్యోగులకు ఇన్సెంటివ్స్ ఇవ్వడం ప్రారంభించాయి. అంతేకాదు, ఉద్యోగులు ఒకే కారులో విధులకు వచ్చేలా కార్ పూలింగ్ ను ప్రోత్సహిస్తున్నాయి. బెంగళూరులోని నెట్ యాప్, మష్రెక్ బ్యాంక్, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి MNC తమ ఉద్యోగుల కీ రిజల్ట్ ఏరియాలో ఉద్యోగుల రవాణా విధానాన్ని భాగం చేశాయి. ప్రజా రవాణాను ఉపయోగించే ఉద్యోగులకు రవాణా ప్రయోజనాలను అందిస్తున్నాయి. ముఖ్యంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి వచ్చే ఉద్యోగులకు ప్రత్యేక ఇన్సెంటివ్స్ ను ఇస్తున్నాయి.

Tags

Next Story