Exam Paper Leak : ఎగ్జామ్ పేపర్ లీక్ కేసులో మరో ఆరుగురు అరెస్ట్

Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లోని స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) ముజఫర్‌నగర్‌లో ఇటీవల జరిగిన పోలీస్ రిక్రూట్‌మెంట్ పరీక్ష పేపర్ లీక్‌లో ప్రమేయం ఉన్న మరో ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. మార్చి 5న మీరట్‌లో వీరిని అరెస్టు చేశారు.
ప్రశ్న పత్రాలు, సమాధానాల కీలతో పాటు ఎనిమిది మొబైల్ ఫోన్‌లను కూడా ఎస్టీఎఫ్ బృందం స్వాధీనం చేసుకుంది. ఉత్తరప్రదేశ్ రిక్రూట్‌మెంట్ అండ్ ప్రమోషన్ బోర్డు ఫిబ్రవరి 17, 18 తేదీల్లో నిర్వహించిన రాత పరీక్ష ప్రశ్నపత్రం లీక్‌లో ఓ ముఠా ప్రమేయం ఉందని అధికారులు కనుగొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో 60,000 పైగా కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 17, 18 తేదీల్లో జరిగిన ఈ పరీక్షకు 48 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఆరు నెలల్లోపు మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని ఇటీవలే అధికారులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com