Account Hack : నా అకౌంట్లు ఎవరో హ్యాక్ చేశారు: సుప్రియా

బాలీవుడ్ నటి, బీజేపీ నేత కంగన రనౌత్‌పై (Kangana Ranaut) కాంగ్రెస్ ప్రతినిధి సుప్రియా శ్రీనతే చేసిన వివాదాస్పద పోస్ట్ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పోస్ట్‌పై సుప్రియా స్పందించారు. ఎవరో తన ఫేస్ బుక్, ఇన్‌స్టా అకౌంట్లు హ్యాక్ చేసి, తప్పుడు పోస్టులు పెట్టారని ట్వీట్ చేశారు. తాను మహిళల పట్ల ఎలా వ్యవహరిస్తానో సన్నిహితులకు తెలుసని పేర్కొన్నారు. తన పేరుతో ట్విటర్‌లో ఉన్న పేరడి అకౌంట్‌పై రిపోర్ట్ చేసినట్లు తెలిపారు.
తనను ‘వేశ్య’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ సుప్రియా శ్రీనతేపై కంగన ఫైర్ అయ్యారు. ఆర్టిస్ట్‌గా నా కెరీర్‌లో నేను అన్ని రకాల పాత్రలు పోషించాను. సెక్స్ వర్కర్లను దూషించడం మానుకోవాలి. ప్రతి మహిళా ఆత్మగౌరవం కోరుకుంటుంది’ అని ఆమె ట్వీట్ చేశారు. కంగనాను ఎంపీ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించిన నేపథ్యంలో సుప్రియ ఆ పోస్టు చేశారు.
కంగనా రనౌత్‌ని బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంతో ఆమె పొలిటికల్ కెరీర్ మొదలైనట్లయింది. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన కంగనా.. 15ఏళ్లప్పుడు ఇంటి నుంచి పారిపోయి, డ్రగ్స్‌కి బానిసయ్యారట. 2006లో ‘గ్యాంగ్‌స్టార్’తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లోనూ నటించారు. ఆమెకు 4 నేషనల్, 5 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, 3 ఇంటర్నేషనల్ అవార్డులు, 2021లో పద్మశ్రీ వచ్చాయి.
Has anyone noticed ! @SupriyaShrinate didn't say 'hacked'; she said, 'someone who had access to my account.'
— कवि: आलोक “अज्ञात” नौटियाल (@alokntyl) March 25, 2024
It means someone is working for her. Now,
what do you think ;!!!!!!!!!!!!
She wasn't involved. #KanganaRanaut #Supriya #Mandi" https://t.co/ffmWDD4pjr pic.twitter.com/32CFMzVvlQ
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com