Rahul Gandhi Resignation : రాహుల్ రాజీనామాకు స్పీకర్ ఆమోదం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) వయనాడ్ ఎంపీ స్థానానికి రాజీనామా చేశారు. రాజీనామాను స్పీకర్ ఆమోదించారని లోక్‌సభ సెక్రటేరియట్ ప్రకటన విడుదల చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో రెండు చోట్ల గెలిచిన రాహుల్ వయనాడ్ నుంచి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ స్థానం నుంచి ప్రియాంక గాంధీ ( Priyanka Gandhi ) పోటీ చేయనున్నట్లు పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రకటించారు.
మరోవైపు, రాహుల్ రాజీనామాతో వయనాడ్ సీటుకు జరగనున్న ఉప ఎన్నికలో ప్రియాంకా గాంధీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సోమవారం ప్రకటించారు. దీంతో ప్రియాంక తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. వయనాడ్ నుంచి ప్రియాంక ఎన్నికైతే తొలిసారిగా ఆమె పార్లమెంటులోకి అడుగుపెడతారు. ఈ ఎన్నికలో గెలిస్తే ముగ్గురు గాంధీలు (సోనియా, రాహుల్, ప్రియాంక) ఒకే సమయంలో పార్లమెంటులో ఉన్నట్లవుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com