SpiceJet : కళానిధి మారన్ నుంచి రీఫండ్ కోరుతున్న స్పైస్ జెట్

SpiceJet : కళానిధి మారన్ నుంచి రీఫండ్ కోరుతున్న స్పైస్ జెట్
X

ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్పైస్ జెట్ సంస్థ తన మాజీ ప్రమోటర్ కళానిధి మారన్ నుంచి రూ.450 కోట్ల మేర రిఫండ్ కోరుతోంది. వాటా బదిలీకి సంబంధించిన కేసులో ఢిల్లీ హై కోర్టు స్పైస్ జెట్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

కళానిధి మారన్ కు చెందిన కేఏఎల్ ఎయిర్వేస్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యూనల్ 2018లో ఇచ్చిన ఆదేశం మేరకు రూ.730 కోట్లును స్పైస్ జెట్ మారన్ కు చెల్లించింది. ఇందులో 580 కోట్లు అసలు, 150 కోట్లు వడ్డీ కలిపి ఉన్నాయి. మే 17న ఢిల్లీ హైకోర్టు స్పైస్ జెట్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. 2023లో ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జ్ బెంచ్ కూడా ఈ తీర్పును సమర్ధించింది. స్పైస్ జెట్ అప్పీల్ కు వెళ్లింది. డివిజన్ బెంచ్ గత తీర్పులను పక్కన పెట్టింది. మారన్ కు రూ.270 కోట్లు చెల్లించాలని ఆదేశించింది.

తాము అదనంగా చెల్లించిన రూ.450 కోట్లను వెనక్కి ఇవ్వాలని స్పైస్ జెట్ కళానిధి మారన్ ను కోరుతోంది. ఆయన ఎలా స్పందిస్తారన్నది చూడాలి.

Tags

Next Story