Ambani Wedding : వాచ్ రూ.2 కోట్లు.. క్యాస్ట్లీ వాచీతో స్టార్ హీరోల ఫోజులు
రిలయన్స్ గ్రూపు అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ, నీతా దంపతుల చిన్న కుమారుడు అనంత్, ఫార్మారంగ వ్యాపారవేత్త వీరేన్, శైల మర్చంట్ల కుమార్తె రాధికా మర్చంట్ పెళ్లి శుక్రవారం రాత్రి గ్రాండ్‌గా జరిగింది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్సు (బీకేసీ) లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ ఈ కల్యాణానికి వేదికగా నిలిచింది. సుమారు రూ.5 వేల కోట్ల ఖర్చుతో జరిగిన ఈ పెళ్లి వేడుకలో దేశవిదేశాలకు చెందిన వ్యాపార, రాజకీయ, సినీ తదితర రంగాల ప్రము ఖులు సందడి చేశారు. కాగా, వివాహానికి హాజరైన తన స్నేహితులు, ఆత్మీయులకు అనంత్ అంబానీ అత్యంత ఖరీదైన వాచీలను కానుకగా అందజేసి నట్లు తెలుస్తోంది. అడెమార్స్ పిగ్యుట్ బ్రాండ్‌కు చెందిన ఈ వాచీ ధర సుమారు కోటిన్నర నుంచి రూ.2 కోట్లు ఉంటుందని అంచనా. గెస్టుల కోసం అంబానీ కుటుంబం వీటిని ప్రత్యేకంగా సిద్ధం చేయించినట్లు సమాచారం. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, రణ్ వీర్ సింగ్ వంటి తారలు ఈ వాచీలతో ఫొటోలకు పోజులిచ్చారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com