Rajya Sabha : రాజ్యసభకు సుధా మూర్తి నామినేట్

Rajya Sabha : రాజ్యసభకు సుధా మూర్తి  నామినేట్
X

ది మూర్తి ట్రస్ట్ చైర్‌పర్సన్ సుధా మూర్తి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. విభిన్న రంగాలలో ఆమె చేసిన సేవలను ప్రశంసిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుధా మూర్తి మన 'నారీ శక్తి'కి శక్తివంతమైన నిదర్శనమని అన్నారు. సుధా మూర్తిని అభినందిస్తూ, ప్రధాని మోదీ Xలో, "భారత రాష్ట్రపతి సుధా మూర్తిజీని రాజ్యసభకు నామినేట్ చేసినందుకు నేను సంతోషిస్తున్నాను. సామాజిక సేవ, దాతృత్వం, విద్యతో సహా విభిన్న రంగాలకు సుధా జీ చేసిన కృషి అపారమైనది, స్ఫూర్తిదాయకం. ఆమె ఉనికి రాజ్యసభలో మన 'నారీ శక్తి'కి ఒక శక్తివంతమైన నిదర్శనం. ఇది మన దేశం విధిని రూపొందించడంలో మహిళల శక్తి, సామర్థ్యాన్ని ఉదాహరణగా చూపుతుంది. ఆమెకు ఫలవంతమైన పార్లమెంటరీ పదవీకాలం రావాలని కోరుకుంటున్నాను"అని రాసుకొచ్చారు.

ప్ర‌స్తుతం థాయ్‌లాండ్‌లో ఉన్న సుధా మూర్తి.. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ వార్త అందుకోవడం చాలా విశేషమని సంతోషం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆమె ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ, ఇప్పుడు దేశానికి సేవ చేసేందుకు తనకు పెద్ద వేదిక లభించిందని అన్నారు.

Tags

Next Story