AICC : ఏఐసీసీ కార్యదర్శి పదవి నుంచి సుధీర్ శర్మ ఔట్

X
By - Manikanta |6 March 2024 2:20 PM IST
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈరోజు (మార్చి 6) తక్షణమే ఏఐసీసీ కార్యదర్శి పదవి నుంచి సుధీర్ శర్మను తొలగించారు. శర్మను తక్షణమే సెక్రటరీ పదవి నుంచి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తొలగించినట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. శర్మ ధర్మశాలకు చెందిన సీనియర్ నాయకుడుస హిమాచల్ ప్రదేశ్ మాజీ మంత్రి. ఇటీవల పార్టీ విప్‌ను ధిక్కరించినందుకు ఎమ్మెల్యేగా అనర్హత వేటు కూడా పడింది.
కాంగ్రెస్‌కు సుధీర్ శర్మ సమాధానం
కాంగ్రెస్ తనను తొలగించిన తర్వాత, సుధీర్ శర్మ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. "మొత్తం భారం నా భుజాలపై నుండి తొలగినట్టుగా నేను ఉపశమనం పొందుతున్నాను" అని చెప్పాడు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com