Delhi : త్వరలోనే అప్రూవర్‌గా మారి నిజాలన్నీ బయటపెడతా .. సుకేశ్ చంద్రశేఖర్ లేఖ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన సీఎం కేజ్రీవాల్‌ను (Arvind Kejriwal) ఉద్దేశిస్తూ మనీలాండరింగ్ నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్ జైలు నుంచి లేఖ రాశారు. ‘తిహార్ క్లబ్‌కు బాస్‌గా మీకు స్వాగతం పలుకుతున్నా. ఖట్టర్ ఇమాందార్(నిజాయితీపరుడు) అనే డ్రామాలకు ముగింపు పడింది. కేజ్రీవాల్ అవినీతి మొత్తం బహిర్గతమవుతోంది. నిజమే గెలుస్తుంది.
ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ మొత్తం 10 కుంభకోణాలు చేశారు. నాలుగు కుంభకోణాలకు నేనే సాక్షిగా ఉన్నాను. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రారంభం మాత్రమే. త్వరలోనే అప్రూవర్‌గా మారి నిజాలన్నీ బయటపెడతానని సుకేశ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. కాగా ఢిల్లీ లిక్కర్ కేసులో ప్రస్తుతం సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేయగా.. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆరు రోజుల ఈడీ కస్టడీ విధించింది. ఈ నెల 28 వరకు కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉండనున్నారు.
ఇటీవల కవితపై ఆరోపణలు చేస్తూ అతను లేఖ రాసిన విషయం తెలిసిందే. నిజం శక్తి ఏంటో తెలుసుకోవాలి. ఎదుర్కోవాల్సి ఉంటుంది. నన్ను ఎవరూ ఏమి చేయలేరని అనుకునేవారు. కానీ కొత్త భారతదేశంలో చట్టమే అన్నింటికన్నా శక్తివంతమైంది. నేను గతంలో మీడియాకు విడుదల చేసిన లేఖల్లో 2 అంశాలు పొందుపరిచాను.
అందులో ఒకటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలవుతుందని.. రెండోది తిహార్ క్లబ్‌లో చేరేందుకు కవితకు కౌంట్ డౌన్ మొదలైందని. ఈ రెండూ ఇప్పుడు నిజమయ్యాయని అనిపిస్తోంది. కవిత అరెస్టుతో అవినీతి పండోరా బాక్స్ ఓపెన్ అయింది అని లేఖలో పేర్కొన్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com