Supreme Court Shock : ఆమ్ ఆద్మీ పార్టీకి సుప్రీం షాక్

Aam Aadmi Party : ఆమ్ ఆద్మీ పార్టీకి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. హైకోర్టు కోసం కేటాయించిన స్థలాన్ని ఆక్రమించి పార్టీ కార్యాలయం నిర్మించారు... తక్షణమే ఆ పార్టీ ఆఫీసు ఖాళీ చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. జూన్ 15లోగా ఆ ప్రక్రియ పూర్తి చేయాలని కోర్టు తెలిపింది. ఆ ప్రదేశాన్ని ఢిల్లీ హైకోర్టు విస్తరణకు కేటాయించినట్టుగా గుర్తించిన సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది.
అప్లికేషనన్ ను ప్రాసెస్ చేసి నాలుగు వారాల్లోగా సమర్పించాలని ఎల్అండ్ డీవోను ఆదేశిస్తున్నట్లు కోర్టు చెప్పింది. సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పర్ధి వాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. ఆక్రమిత స్థలంలో ఆప్ కార్యాలయం కొన సాగించేందుకు చట్టపరమైన హక్కు లేదని పేర్కొంది. చట్టా న్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోవద్దు అని హెచ్చరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com