Delhi Water Tank Mafia : ఢిల్లీలో నీళ్ల ట్యాంకర్ మాఫియాపై సుప్రీం ఆగ్రహం

దేశ రాజధాని ఢిల్లీ తాగునీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రజలు నీటి కోసం ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తోంది. నీటి ట్యాంకర్ మాఫియాను నియంత్రించడానికి, నీటివృధాను అరికట్టడానికి ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నదని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.
హిమాచల్ ప్రదేశ్ నుంచి మిగులు జలాల విడుదల చేయాలని కోరుతూ అరవింద్ కేజీవా ప్రభుత్వం సుప్రీం కోర్టును అభ్యర్థించింది. ఈ సందర్భంగానే సుప్రీం కోర్టు పై విధంగా స్పందించింది. ఢిల్లీలో ట్యాంకర్ మాఫియా చాలా ఎక్కువగా కనిపిస్తోందని, నీటినంతా ఈ మాఫియా మింగేస్తోందని, నీరు వృధా అవుతోందని కోర్టు అభిప్రాయపడింది. దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందని ప్రశ్నించింది. హిమాచల్ ప్రదేశ్ నుంచి వస్తున్న నీరంతా ఎటుపోతోందని ప్రశ్నించింది. నీటి కోసం ప్రజలు బాధపడుతున్నారని, మీడియాలో ఈ దృశ్యాలు వస్తున్నాయని, తాము కూడా వీటిని గమనిస్తున్నామని తెలిపింది. ఇది అరికట్టేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది చెప్పాలని కోరింది.
నీటి వృధాను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలపై వెంటనే నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశించింది. తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని హిమాచల్ ప్రభుత్వాన్ని కూడా సుప్రీం కోర్టు మందలించింది. విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఢిల్లీలో నీళ్లు వేస్ట్ చేస్తే రూ.2వేల జరిమానా అమలులో ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com