Suspension : అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై అసెంబ్లీలో సస్పెన్షన్

Suspension : అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై అసెంబ్లీలో సస్పెన్షన్
X

కల్తీ మద్యం వివాదం తమిళనాడు అసెంబ్లీని షేక్ చేస్తోంది. కల్తీ మద్యం ఘటనపై ఆందోళన చేస్తున్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై అసెంబ్లీలో సస్పెన్షన్ వేటు పడింది. అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు ఆ పార్టీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ విధించారు. సభలో ప్రశ్నోత్తరాలను వాయిదా వేసి కళ్ల కురిచిలో కల్తీ మద్యం తాగి మరణాలు నమోదు అయిన ఘటనపై చర్చ చేపట్టాలని, ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం స్టాలిన్ రాజీనామా చేయాలని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు డిమాండ చేశారు.

దీంతో ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామితో పాటు ఇతర అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై వేటు వేశారు. అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటున్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను సభ నుంచి పంపించివేయాలంటూ తమిళనాడు స్పీకర్ ఎం అప్పవు ఆదేశించారు. రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించారు.

Tags

Next Story