Swati Maliwal : నా ఫ్యామిలీ జోలికి రావద్దు.. స్వాతి మలివాల్

ఆప్ నేతలు తన వ్యక్తిగత వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఆరోపించారు. దీని వల్ల తన కుటుంబానికి ప్రమాదముందన్నారు. తనపై జరిగిన దాడి విషయంలో విచారణ జరుగుతున్న సమయంలో ఆప్ నేతలు తన వ్యక్తిగత వివరాలైన వాహన నెంబర్లు మొదలైన వాటిని లీక్ చేయడాన్ని ప్రశ్నించారు.
ఎక్స్ వేదికగా స్పందించిన స్వాతి.. తాను అవినీతికి పాల్పడినందుకే కేసు నమోదు చేసినట్టుగా ఢిల్లీ మంత్రులు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. బీజేపీ సూచనల మేరకే చేశానని పుకార్లు సృష్టిస్తున్నారు. 2016లో తన మీద నమోదైన కేసుకు వ్యతిరేకంగా న్యాయబద్దంగా పోరాటం చేశానననీ.. వారికి తానిప్పుడు బీజేపీ ఏజెంట్ గా కనిపిస్తున్నానా అని ప్రశ్నించింది.
ఢిల్లీ మంత్రులు అధికార మత్తులో ఉన్నారని, నిజం ఎప్పటికైనా బయటపడుతుందన్నారు స్వాతి. ఢిల్లీ మంత్రులు చెప్పే ప్రతి అబద్ధాన్ని కోర్టుకు లాగుతానని హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com