Swiggy Delivery : లేడీని అక్కడ తాకాడు.. స్విగ్గీ డెలివరీ బాయ్ అరెస్ట్

నగరాల్లో అపరిచిత వ్యక్తులకు అతి అనుమతి అంతమంచిది కాదు. మహిళను లైంగిక వేధించినందుకు బెంగుళూరులో (Banalore) స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ని అరెస్టు చేశారు. అతను ఆర్డర్ డెలివరీ చేయడానికి తన ఇంటికి వచ్చినప్పుడు అతను తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, తనను అనుచితంగా తాకాడని ఆరోపిస్తూ ఒక మహిళ ఫిర్యాదు చేసింది.
ఎఫ్‌ఐఆర్ ప్రకారం ఈ సంఘటన మార్చి 17న జరిగింది. డెలివరీ ఎగ్జిక్యూటివ్ అయిన ఆకాష్ సాయంత్రం 6.30 గంటలకు ఆరుషి మిట్టల్ (ఫిర్యాదుదారు) ఇంటికి ఫుడ్ ఆర్డర్ డెలివరీ చేశాడు. అతను మొదట బాత్రూమ్‌ను ఉపయోగించకోవచ్చా? అని ఆరుషి మిట్టల్‌ని అడిగాడు. ఈ క్రమంలోనే అతడు ఇంట్లోకి ప్రవేశించారు.
తరువాత తాగునీరు కూడా అడిగాడు. ఫిర్యాదుదారురాలు నీరు తీసుకురావడానికి వంటగదికి వెళ్లినప్పుడు, అతను ఆమెను వెనుక నుండి కౌగిలించుకుని, ఆమె చేయి కూడా పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అతని చర్యకు షాక్‌కు గురైన సదరు మహిళ.. అతడిని అరుస్తూ చెంపదెబ్బ కొట్టిందని ఎఫ్‌ఐఆర్‌లో తెలిపారు పోలీసులు. ఐపీసీ లోని 354ఏ సెక్సువల్ హెరాస్ మెంట్ కింద అతడిపై కేసు నమోదు చేశారు. ఆ డెలివరీ బాయ్ పరారీలో ఉన్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com