Manipur Visit: మణిపుర్‌కు ప్రతిపక్ష బృందం... మోదీపై రాహుల్‌ విమర్శనాస్త్రాలు

Manipur Visit: మణిపుర్‌కు ప్రతిపక్ష బృందం... మోదీపై రాహుల్‌ విమర్శనాస్త్రాలు
ఈనెల 29, 30 తేదీల్లో మణిపుర్‌లో పర్యటించనున్న ఇండియా ఫ్రంట్‌ నేతలు

మూడు నెలలుగా జాతుల మధ్య వైరంతో రగిలిపోతున్న మణిపుర్‌(Manipur )లో ఇండియన్‌ నేషనల్‌ డెమోక్రటిక్‌ ఇన్‌క్లూజీవ్‌ అలయెన్స్(INDIA) నేతలు పర్యటించబోతున్నారు. మణిపుర్‌లో పరిస్థితులను పర్యవేక్షించేందుకు, శాంతి స్థాపన కోసం ఈ నెల 29, 30 తేదీల్లో ప్రతిపక్ష ఇండియా ఫ్రంట్‌ నేతలు(Team of MPs) ఈశాన్య రాష్ట్రంలో పర్యటిస్తారని లోక్‌సభలో కాంగ్రెస్‌ విప్‌ మాణికం ఠాకూర్‌ తెలిపారు. ఇండియా కూటమికి చెందిన 26 ప్రతిపక్ష పార్టీల‍ 26( Opposition parties )కు చెందిన 20 మందికిపైగా ఎంపీల బృందం మణిపుర్‌లో పర్యటించి అక్కడి పరిస్థితిని తెలుసుకోనుంది.

మణిపూర్‌లో పర్యటించాలని ఎంపీలు( MPs to visit Manipur) ఎప్పటినుంచో భావిస్తున్నా భద్రతా కారణాల పేరుతో అధికారులు అనుమతి ఇవ్వలేదని కాంగ్రెస్‌ పార్టీ విమర్శించింది. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్నబీజేపీ ప్రభుత్వాల అలసత్వం కారణంగానే మణిపుర్‌ అట్టుడుకుతోందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకునేందుకే తాము మణిపుర్‌ వెళ్తున్నామని ప్రతిపక్షాలు వెల్లడించాయి.


మరోవైపు.... ప్రధాని మోదీ( PM MODI)పై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ(RAHUL GANDHI) తీవ్రంగా మండిపడ్డారు. ప్రధాని మోదీ భావజాలమే మణిపూర్‌ను తగులబెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భావజాలమే మణిపుర్‌ను తగులబెడుతోందని మోదీకి బాగా తెలుసని, అందుకే ఆయన నోరు విప్పడం లేదని ఆరోపించారు. మోదీ కేవలం అతి కొద్ది మందికి మాత్రమే ప్రధాన మంత్రని దుయ్యబట్టారు. యూత్‌ కాంగ్రెస్‌ సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న రాహుల్‌ ప్రధాని మోదీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు.

బీజేపీ- RSS(BJP_RSS) అధికారం కోసం ఎంతకైనా దిగజారుతాయని మోదీ అన్నారు. అధికారంలోకి వచ్చేందుకు దేశాన్ని తగలబెట్టేందుకు కూడా కమలం పార్టీ వెనక్కి తగ్గదని రాహుల్‌ అన్నారు. మణిపుర్ మహిళల బాధల గురించి ఆయన పట్టించుకోరని విమర్శించారు. ఓ రాష్ట్రం తగులబడుతుంటే.. దేశ ప్రధాన మంత్రి ఏదైనా చెబుతారని ప్రజలు భావిస్తారని, ప్రధాని కనీసం ఇంఫాల్ వెళ్లి, ప్రజలతో మాట్లాడతారని మీరు అనుకొని ఉంటారని... కానీ మణిపుర్‌కు ప్రధానమంత్రి ఎందుకు వెళ్లడం లేదో, ఎందుకు మాట్లాడటం లేదో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారని రాహుల్‌ అన్నారు. నరేంద్ర మోదీ కేవలం కొందరికి మాత్రమే, ఆరెస్సెస్‌కు మాత్రమే ప్రధాన మంత్రని తీవ్ర విమర్శలు చేశారు.


మణిపూర్‌(MANIPUR) రాష్ట్రంలోని మైతీ, కుకీ తెగల మధ్య ఘర్షణలతో మే 3 నుంచి రగులుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరు మహిళలను కొందరు వ్యక్తులు నగ్నంగా ఊరేగించిన ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయిన విషయం తెలిసిందే.

Tags

Read MoreRead Less
Next Story