UP : యూపీలో తెలంగాణ మహిళ పోటీ

తెలంగాణకు చెందిన శ్రీకళారెడ్డి ఉత్తర్ ప్రదేశ్ లోని జౌన్‌పుర్ బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమె మాజీ ఎంపీ ధనుంజయ్ సింగ్ మూడో భార్య. వివిధ కేసుల్లో ఆయనకు శిక్షపడటంతో భార్యను బరిలో నిలిపారు. శ్రీకళారెడ్డి తండ్రి జితేందర్ రెడ్డి గతంలో హుజూర్‌నగర్‌లో స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలిచారు. తల్లి లలితారెడ్డి సర్పంచిగా సేవలందించారు. నిప్పో బ్యాటరీల కంపెనీ ఈ కుటుంబానికి చెందినదే. శ్రీకళారెడ్డి పేరిట రూ.780 కోట్ల ఆస్తులున్నాయి.
జౌన్‌పుర్ పరిధిలో శ్రీకళారెడ్డికి బలం, బలగం అన్నీ ఆమె భర్తే. శ్రీకళారెడ్డి భర్త పేరు ధనంజయ్ సింగ్. ఆయన మాజీ ఎంపీ. స్థానికంగా బాహుబలి నేతగా, బీఎస్పీ అధినేత్రి మాయవతికి సన్నిహితుడిగా ధనంజయ్ సింగ్‌కు పేరుంది. కిడ్నాప్, దోపిడీ కేసులో ఆయన జైలుకు వెళ్లడం వల్ల ఎన్నికల్లో పోటీ చేయకుండా కోర్టు బ్యాన్ విధించింది. దీంతో జౌన్‌పుర్ లోక్‌సభ టికెట్‌ను ధనంజయ్ సింగ్ సతీమణి శ్రీకళారెడ్డికి మాయావతి కేటాయించారు.
శ్రీకళారెడ్డి బాల్యం కూడా చెన్నైలోనే గడిచింది. ఆమె ఇంటర్మీడియట్ చెన్నైలో చేయగా, బీకామ్ కోర్సు హైదరాబాద్‌లో పూర్తి చేశారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక అమెరికాకు వెళ్లి ఆర్కిటెక్చర్ ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సు చేశారు. అనంతరం ఇండియాకు తిరిగొచ్చి కుటుంబం నడిపే వ్యాపారాలను చూసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com