Terrorists Attack : రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఆర్మీ వాహనంపై టెర్రరిస్టుల దాడి

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కథువాలో ఆర్మీ వాహనంపై దాడి చేశారు. కొండ పైనుంచి వెహికల్‌పై కాల్పులు జరిపి, గ్రెనేడ్స్ వేయడంతో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. తొలుత గ్రనేడ్ విసిరిన టెర్రరిస్టులు ఆ తర్వాత కాల్పులు జరిపిట్టు చెబుతున్నారు. బిల్లావార్ తహసిల్‌లోని లోహైమల్హార్ బ్లాక్ మచ్చేడి ప్రాంతంలో ఈ దాడి ఘటన జరిగింది. వెంటనే అదనపు బలగాలు ఘటనా స్థలికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. నిన్న కుల్గాంలో సైన్యం, టెర్రరిస్టులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు. ఆరుగురు ముష్కరులు చనిపోయారు. కాగా ఇటీవల జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల కదలికలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com