Tesla Enters India : భారత్ లోకి టెస్లా ఈవీ

ఉద్యోగాల భర్తీ ప్రారంభం లింక్డ్ ఇన్ నోటిఫికేషన్ ఢిల్లీ: ప్రపంచ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ టెస్లా భారత్ లో ఉద్యోగాల భర్తీని ప్రారంభించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే అమెరికాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ను కలిశారు. భారత మార్కెట్ లోకి రావాలని ఆహ్వానించా రు. ఈ మేరకు హైరింగ్ ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఎలక్ట్రిక్వాహన తయారీ సంస్థ కస్టమర్ ఫేసింగ్, బ్యాక్ఎండ్ సహా 13 రకాల ఉద్యోగాలకు దరఖాస్తులును కోరినట్టు లింక్డ్ ఇన్ లో నోటిఫికేషన్ వెలువడింది. సర్వీస్ టె క్నీషియన్, వివిధ సలహా పాత్రలతో సహా ఐదు పోస్టులు ముంబై ,ఢిల్లీలో ఉన్నాయి. మిగిలిన ఖాళీలు, కస్టమర్ ఎంగేజ్మెంట్ మేనేజర్, డెలివరీ ఆపరేషన్స్ స్పెషలిస్ట్ వంటివి ఉద్యోగా లు ముంబై లో అవసరం ఉంటుందని నోటిఫికే షన్ లో తెలిపింది. ఇన్నాళ్లు సుంకాల కారణంగా దూరం దక్షిణాసియా దేశాల్లో అధిక దిగుమతి సుంకాల వసూలు కారణంగా ప్రపంచ దిగ్గజ కార్ల ఉత్పత్తి సంస్థ టెస్లా ఇప్పటి వరకు భారత్ కు దూరంగా ఉంది. భారతదేశం ఇప్పుడు 40,000 డాలర్ల( రూ. 34 లక్షలు) కన్నా ఎక్కువ ధర కలిగిన హైఎండ్ కార్లపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని 110% నుంచి 70%కి తగ్గిం చింది. మోదీ మస్క్ భేటీలో సుంకాల అంశం చర్చకు రాగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. తాజా పరిణామాలతో త్వరలోనే దేశీయ రోడ్లపై టెస్లా కార్లు చక్కర్లు కొట్టే అవకా శాలున్నట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com