India 5G Network : 2026 తరువాత దేశమంతా పూర్తిగా 5జీ నెట్ వర్క్

దేశం మొత్తం 2026 తరువాత పూర్తిగా 5జీ నెట్ వర్క్ పైనే మాత్రమే పని చేస్తుందని, 6జీ టెలికం కనెక్టివిటీ కోసం ఇప్పటికే స్వదేశీ టెక్నాలజీని అభివృద్ధి చేయడం ప్రారంభించినట్లు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఇండియా- ఇజ్రాయెల్ బిజినెస్ ఫోరమ్ సమావేశంలో ఆయన ప్రసంగించారు. 5జీ కనక్టివిటీ శరవేగంగా విస్తరిస్తోందని, మౌలిక సదుపాయాల విస్తరణ, ప్రజా సంక్షేమ కార్యక్రమాల ప్రాధాన్యతను నొక్కి చెప్పారు. గత 10 సంవత్స రాలుగా దేశంలో మౌలికసదుపాయల అభివృద్ధి భారీగా జరుగుతుందని చెప్పారు. ఇండియా తన
కేంద్రమంత్రి పీయూష్ గోయల్ పోర్టుల సామర్ధ్యాన్ని రెట్టింపు చేసిందని, ఎయిర్ పోర్టు లను 74 నుంచి 150కి విస్తరించిందని, వీటిని వచ్చే ఐదు ఆరు సంవత్సరాల్లో 225కి పెంచనుందని చెప్పారు. వీటితో పాటు దేశంలో హైవేలు, రోడ్ వేల అభివృద్ధి గణనీయంగా జరిగిందన్నారు. మరో 3 కోట్ల ఇళ్లను నిర్మిస్తామని చెప్పారు. దీనితో నిరుపేదల్లో 25 శాతం మందికి పక్కా ఇల్లు సమకూరుతుందన్నారు. దేశంలో ప్రతి ఇంటికి విద్యుత్ సదుపాయం, డిజిటల్ కనెక్టివిటీని ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, 160 మిలియన్ల ఇళ్లకు ఇప్పటికే సురక్షిత మంచి నీటి సదుపాయాన్ని కల్పిస్తున్నా మని చెప్పారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com