Polling : ఊపందుకున్న తొలిదశ పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు వీళ్లే!

దేశంలోనే అత్యంత సుదీర్ఘంగా జరగనున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఇవాళ మొదలైంది. దేశమంతటా లోక్ సభ, పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ జరుగుతోంది. మొదటి విడతలో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ కొనసాగుతున్నాయి. పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ నటులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
రాజస్థాన్‌లోని జైపుర్‌లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ ఓటు వేయగా.. మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సిక్కింలోని సోరెంగ్‌లోని పోలింగ్ స్టేషన్ వెలుపల పోలింగ్ ప్రారంభానికి ముందే ప్రజలు క్యూ కట్టారు. మణిపూర్ ఇంఫాల్‌లోని ఓ పోలింగ్ బూత్ వెలుపల ఓటింగ్‌కు ముందు మహిళలు పూజలు నిర్వహించారు. తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్ చెన్నైలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి బైక్‌పై వచ్చి ఓటు వేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు కోయంబత్తూర్ లో సద్గురు ఓటు వేశారు. రాందేవ్ బాబా కూడా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Actor #VijaySethupathi cast his vote. #LokSabhaElections2024 #ElectionDay pic.twitter.com/o3E5yGIDo2
— SR ⁶⁹ (@ultimate__d) April 19, 2024
తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, బిహార్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, రాజస్థాన్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్మూ కశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిలో పోలింగ్ జరుగుతోంది. చెన్నై దక్షిణ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై చెన్నై సాలిగ్రామం పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తమిళనాడు కాంగ్రెస్ నేత పి. చిదంబరం శివగంగలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు, కోయంబత్తూరు నుంచి ఎంపీగా పోటీచేస్తున్న కె. అన్నామలై కరూర్ జిల్లాలోని ఉతుపట్టిలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ చెన్నైలోని ఓ పోలింగ్‌బూత్‌లో ఓటు వేశారు. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నాగ్‌పూర్‌లో ఓటు వేశారు. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
VIDEO | Actor and Makkal Needhi Maiam founder leader Kamal Haasan (@ikamalhaasan) arrives at a polling booth in #Chennai, Tamil Nadu, to cast his vote.#LSPolls2024WithPTI #LokSabhaElections2024
— Press Trust of India (@PTI_News) April 19, 2024
(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/jAb93C2mcW
Superstar Rajnikanth, Thala #AjithKumar, Vijay. Sethupathi and Dhanush cast their votes earlier today for the #LokSabhaElections2024 ! 🗳️#Rajinikanth #VijaySethupathi #Dhanush #Sivakarthikeyan #VoteForINDIA #Elections2024 #ElectionDay pic.twitter.com/3rDMmxDCve
— Maddy💖 (@Shuklaji321) April 19, 2024
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com