Polling : తొలి విడత పోలింగ్ ప్రారంభం

Polling : తొలి విడత పోలింగ్ ప్రారంభం

ప్రపంచంలోనే అతి పెద్ద ఎన్నికగా అభివర్ణిస్తున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ మొదలైంది. మొదటి విడతగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ఉదయం 7గంటలకు మొదలైంది. 102 నియోజకవర్గాల ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 1,625 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాగా ఏప్రిల్ 26, మే 7, 13, 20, 25తో పాటు జూన్ 1న మిగతా దశల్లో ఎన్నికలు జరుగుతాయి.

లోక్‌సభ తొలి విడత ఎన్నికల్లో భాగంగా నేడు 1625 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరిలో 450 మంది అభ్యర్థులు కోటీశ్వరులే కావడం గమనార్హం. తమిళనాడు నుంచి అత్యధికంగా 202 మంది సంపన్న అభ్యర్థులు ఉన్నారు. మరోవైపు క్రిమినల్ కేసులు ఉన్న 251 మంది అభ్యర్థుల్లో 28 మంది బీజేపీ, 19 మంది కాంగ్రెస్‌కు చెందిన వారు ఉన్నారు. DMK, AIADMK నుంచి చెరో 13 మందిపైన క్రిమినల్ కేసులు ఉన్నాయి.

అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధాని మోదీ కోరారు. ‘ఇవాళ 102 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. రికార్డు స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నా. ముఖ్యంగా యువత, తొలిసారి ఓటు వచ్చినవారు తప్పకుండా అధిక సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనాలి. ప్రతి ఓటు, ప్రతి ఒక్కరి వాయిస్ ముఖ్యమే’ అని మోదీ ట్వీట్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story