Third Phase Polling : మూడో విడత పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన మోదీ

Third Phase Polling : మూడో విడత పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన మోదీ
X

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇవాళ 3వ విడత పోలింగ్ ప్రారంభమైంది. ఉ.7 గంటల నుంచి సా.6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మోదీ, అమిత్ షా అహ్మదాబాద్‌లో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. గుజరాత్‌ 25 లోక్‌సభ, కర్ణాటక 14, మహారాష్ట్ర 11, ఉత్తరప్రదేశ్10, మధ్యప్రదేశ్ 9, ఛత్తీస్‌గఢ్ 7, బిహార్ 5, అస్సాం 4, బెంగాల్ 4, గోవాలో 2. దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యులోని 2 స్థానాల్లో అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

మొత్తం 1300కుపైగా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరిలో 120 మందికిపైగా మహిళలు ఉన్నారు. అమిత్ షా, జ్యోతిరాదిత్య సింధియా, మాన్సుఖ్ మాండవీయ, ప్రహ్లాద్ జోషి, డింపుల్ యాదవ్, సుప్రియా సూలే, సునేత్ర పవార్ వంటి ప్రముఖులు బరిలో ఉన్నారు.

మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గాంధీనగర్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని అహ్మదాబాద్‌లో ఓటేశారు. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైన కాసేపటికే ఆయన రాణీప్‌ ప్రాంతంలోని నిషాన్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌కు చేరుకున్నారు. గాంధీనగర్‌ నుంచి బరిలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆ సమయంలో ప్రధానితో పాటే ఉన్నారు.

Tags

Next Story