Gandhi's : దక్షిణాది నుంచి ముగ్గురు గాంధీలు!

Gandhis : దక్షిణాది నుంచి ముగ్గురు గాంధీలు!
X

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ( Priyanka Gandhi ) మొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగనున్నారు. రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) ఖాళీ చేయనున్న కేరళలోని వయనాడ్ స్థానం నుంచి ఆమె లోక్సభ ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. రాహుల్ గాంధీ రాయబరేలీకి ( Rae Bareli ) ప్రాతినిధ్యం వహిస్తారు. వయనాడ్ నుంచి ప్రియాంక గాంధీ ఎన్నికైతే తొలిసారిగా పార్లమెంటులోకి ఆమె అడుగుపెడతారు.

అలాగే దక్షిణాది నుంచి ప్రాతినిధ్యం వహించిన గాంధీ కుటుంబం లోని మూడో వ్యక్తిగా గుర్తింపు పొందుతారు. ఇదివరకు ఇందిరా గాంధీ ( Indira Gandhi ), రాహుల్ గాంధీ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. అలాగే ముగ్గురు గాంధీలు ఒకే సమయంలో పార్లమెంటులో ఉన్నట్లవుతుంది.

వయనాడ్ నుంచి ప్రియాంకను బరిలోకి దింపాలని అధిష్టానం నిర్ణయించడాన్ని కాంగ్రెస్ పార్టీ కేరళ విభాగం స్వాగతించింది. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓ మహిళను పోటీలో నిలబెట్టాలని నిర్ణ యించడం చాలా సంతోషంగా ఉందని సీపీఐ నేత అన్నీ రాజా స్వాగతించారు. మరోవైపు కాంగ్రెస్ ఒక పార్టీ కాదని, అది ఒక కుటుంబ కంపెనీ అని బీజేపీ వ్యాఖ్యానించింది. వారసత్వ రాజకీయాలను ఇది రుజువని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనా వాలా విమర్శించారు. తల్లి రాజ్యసభలో, కొడుకు, కుమార్తె లోకభలో ఉంటారు. ఇది వారసత్వ రాజకీయాలకు చిహ్నం అని విమర్శించారు.

పియాంక గాంధీని వయనాడ్ నుంచి పోటీకి దించడాన్ని బీజేపీ తప్పుబట్టింది. కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తోందని, మరోస్థానం నుంచి పోటీచేస్తున్న విషయం దాచివుంచి ఒకరి తర్వాత మరొకరిని గాంధీ కుటుంబం వయనాడ్ ప్రజలపై రుద్దుతుండటం సిగ్గుచేటని మాజీ కేంద్ర మంత్రి, బీజేపీనేత రాజీవ్ చంద్రశేఖర్ విమర్శించారు. ప్రజలం స ఇలా ద్రోహం చేయడం వల్లే రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మూడోసారి ఓటమి పాలైందన్నారు.

Tags

Next Story