Indian Army : ముగ్గురు లష్కరే టెర్రరిస్టులు ఇండ్లు పేల్చివేత

పాకిస్థాన్‌పై ప్రతీకారంతో రగిలిపోతున్న భారత్ పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తోంది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వం, భద్రతా దళాలు దక్షిణ కశ్మీర్‌లో మిలిటెంట్లను న్యూట్రల్ చేశాక పాకిస్థాన్‌తో యుద్ధానికి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. దక్షిణ కశ్మీర్‌లోని రైస్ జిల్లాలో గడిచిన 4 సంవత్సరాల నుంచి స్లీపర్ సెల్స్ , సానుభూతిపరులు మిలిటెంట్లకు అన్ని రకాల సహాయాలు వసతులు ఏర్పాటు చేస్తున్నారని ఐబీతో పాటు రా అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. దాదాపు పదుల సంఖ్యలో మిలిటెంట్లు ఉన్నట్లు సమాచారం.
మరోవైపు ముగ్గురు లష్కరే టెర్రరిస్టుల ఇళ్లను భారత్ ఆర్మీ పేల్చేసింది. షాహిద్ అహ్మద్, అహసాన్ అహ్మద్ షేక్, జాహిద్ అహ్మద్ ఇళ్లను సైనికులు పేల్చేశారు. వారి కోసం ఆర్మీ బలగాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com