Haryana Incident : హర్యాణాలో ఘోరం ప్రమాదం.. 8మంది మృతి

Haryana Incident : హర్యాణాలో ఘోరం ప్రమాదం.. 8మంది మృతి
X

హర్యాణాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. హర్యానాలోని కుండలలి మనేసర్ పల్వాల్ ఎక్స్ ప్రెస్ వే మీద ఓ బస్సులో శుక్రవారం అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. దీంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో 8మంది చనిపోయారు. దాదాపు 20 మందికి గాయాలు అయ్యాయి. ప్రమాదంలో గాయపడ్డవారిని నుహ్‌లో ప్రభుత్వ హాస్పిటల్ లో చేర్పించారు.

ఒకే కుటుంబానికి చెందిన 60మంది బస్సులో తీర్థయాత్రలకు వెళ్లివస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సులో ఉన్నవారంతా ఉత్తరప్రదేశ్ లోని మధుర, బృందావన్ టూర్ కు వెళ్లి సొంతరాష్ట్రమైన పంజాబ్ కు తిగురు ప్రయాణమైయ్యారు. బస్సులో మహిళలు, పిల్లలతో సహా బంధువులు 60 మంది ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story