Voting : ఓటింగ్ పై అవగాహన కల్పిస్తోన్న ట్రాన్స్‌జెండర్లు

ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) ట్రాన్స్‌జెండర్లు ఇప్పుడు ఓటర్లలో అవగాహన పెంచడంలో సహాయపడతారని అధికారులు తెలిపారు. వీధి నాటకాలు, ఇతర కార్యక్రమాల ద్వారా ఓటింగ్ శాతాన్ని పెంచడంపై దృష్టి సారించిన ఎన్నికల సంఘం ఇందుకోసం పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. మార్చి 31న గోండా జిల్లా నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లా మేజిస్ట్రేట్/జిల్లా ఎన్నికల అధికారి అధ్యక్షతన సాంఘిక సంక్షేమ శాఖ 'ట్రాన్స్‌జెండర్ సంవాద్' నిర్వహించింది.
ట్రాన్స్‌జెండర్ డైలాగ్‌లో, జిల్లా మేజిస్ట్రేట్ (డిఎం) నేహా శర్మ మాట్లాడుతూ, సాధారణ ప్రజలతో ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి ఉన్న అనుబంధం చాలా బాగుంది. ఇతర వాలంటీర్ల కంటే ట్రాన్స్‌జెండర్లు సాధారణ ప్రజలతో ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. జిల్లాలో 25 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారని డీఎం శర్మ తెలిపారు. వీరిలో 97 మంది ట్రాన్స్‌జెండర్ల ఓటర్లున్నారన్నారు.
భారత్‌లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలు ప్రపంచంలోనే అతి పెద్ద ఎన్నికలు. ఇందులో ట్రాన్స్‌జెండర్లకు కూడా కీలక పాత్ర ఉంది. ప్రజలందరినీ ఎన్నికల్లో భాగస్వాములను చేసేందుకు ఎన్నికల సంఘం ప్రాధాన్యతనిస్తోందని ఆమె అన్నారు. ఓటరు అవగాహన కార్యక్రమానికి సంబంధించి ట్రాన్స్‌జెండర్ గ్రూప్ అధినేత అమృతా సోనీ పలు సూచనలు చేశారు. అలాగే జిల్లాలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు వివిధ రకాల వీధినాటకాలు, ఇతర కార్యక్రమాలను ప్రదర్శిస్తామని ఆమె తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com