Ambani Wedding : అనుమతి లేకుండా అంబానీ పెళ్లికి వెళ్లిన ఇద్దరు అరెస్ట్

Ambani Wedding : అనుమతి లేకుండా అంబానీ పెళ్లికి వెళ్లిన ఇద్దరు అరెస్ట్
X

అపర కుబేరుడు ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్‌ల పెళ్లికి ఆహ్వానం లేకుండా వెళ్లిన ఇద్దరిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై బాంద్రా కుర్లా కాంప్లెక్స్ PSలో కేసులు నమోదు చేశారు. వారిలో ఒకరు అల్లూరి వెంకటేశ్ నరసయ్య(26) కాగా, మరో వ్యక్తి షేక్ మహ్మద్ షఫీ(28)గా గుర్తించారు. వీరిద్దరూ ఏపీ నుంచి వచ్చినట్లు ముంబై పోలీసులు తెలిపారు. నిందితులకు నోటీసులిచ్చి ఆ తర్వాత వదిలిపెట్టారు.

ఇక ఈ పెళ్లి కోసం అంబానీ కుటుంబం 5 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇక మీడియా, సోషల్‌ మీడియా ఎక్కడ చూసినా.. అనంత్‌ అంబానీ పెళ్లి ముచ్చట్లే కనిపిస్తున్నాయి. ఈ పెళ్లిలో అంబానీ కుటుంబం ధరించిన దుస్తులు.. వివాహం వేళ నూతన దంపతులు ధరించిన ఆభరణాలు, దుస్తులకు సంబంధించిన వివరాలు.. ఖరీదు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

పెళ్లిలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. జెడ్ ప్లస్ సెక్యూరిటీతో అంబానీ కుటుంబ సభ్యులందరూ పెళ్లికి హాజరయ్యారు. ఈవెంట్ సమయంలో ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ ఆపరేషన్ సిస్టమ్ (ISOS) సెటప్ చేశారు. ఈవెంట్ భద్రతా ఆపరేషన్ ఈ ISOS కేంద్రం నుంచి పర్యవేక్షించబడుతుంది. 60 మంది భద్రతా బృందంలో 10 మంది ఎన్‌ఎస్‌జి కమాండోలు, పోలీసు అధికారులు ఉన్నారు. 200 మంది అంతర్జాతీయ భద్రతా సిబ్బందిని నియమించనున్నారు. 300 మంది సెక్యూరిటీ సభ్యులు ఉన్నారు. బీకేసీలో 100 మందికి పైగా ట్రాఫిక్ పోలీసులు, ముంబై పోలీసు సిబ్బందిని మోహరించారు.

Tags

Next Story