SRSP Canal : ఎస్సారెస్పీ కెనాల్‌లో పడి ఇద్దరు మృతి

చేపల వేటకు వెళ్లిన ఇద్దరు యువకులు ఎస్సారెస్పీ కెనాల్‌లో పడి చనిపోయారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో సోమవారం వెలుగుచూసింది. బిహార్ రాష్ట్రంలోని గయ జిల్లా రాచకోటకు చెందిన డి.అనిల్‌కుమార్ (24), దీపక్‌కుమార్ (20) వారం క్రితం ఎల్కతుర్తిలోని ఓ గ్రానైట్ ఫ్యాక్టరీలో కూలీలుగా చేరారు. శనివారం మధ్యాహ్నం చేపలు పట్టేందుకు స్థానిక ఎస్సారెస్పీ కెనాల్‌కు వెళ్లారు.
అనిల్‌కుమార్ కాల్వలో పడి కొట్టుకుపోతుండగా అతన్ని కాపాడేందుకు దీపక్‌కుమార్ సైతం నీటిలోకి దిగాడు. దీంతో నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. శనివారం రాత్రి వరకు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. సోమవారం గీసుకొండ, చింతగట్టు వద్ద ఇద్దరు యువకులు డెడ్‌బాడీలు కనిపించడంతో దీపక్, అనిల్‌గా గుర్తించారు. డెడ్‌బాడీలను పోస్ట్‌మార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com