Aadhar Card : పదేళ్లు దాటిన ఆధార్ చెల్లుబాటుపై యూఐడీఏఐ కీలక ప్రకటన

ఆధార్ కార్డు చెల్లుబాటు గురించి సామాజిక మాధ్య మాల్లో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని యూఐడీఏఐ కొట్టిపారేసింది. జూన్ 14లోపు వ్యక్తిగత వివరాలను అప్లోడ్ చేయకపోతే కార్డు పనిచేయదనే వదంతుల్ని నమ్మవద్దని చెప్పింది. ఆధార్ కేవలం ఉచితంగా వివరాలు సవరించుకోవడానికి మాత్రమే జూన్ 14వ తేదీని గడువుగా చెప్పడం జరిగిందని, ఆలోగే వివరాలు సవరించకపోయినా ఆధార్ కార్డు చెల్లుబాటు అవుతుందని, ఎప్పటిలాగే పనిచేస్తుందని యూఐఏడీఐ స్పష్టంచేసింది.
జూన్ 14 తర్వాత కూడా వివరాలు అప్డేట్ చేసుకునే అవకాశం ఉందని తెలిపింది. ఆధార్ కేంద్రాలకువెళ్లి నిర్దేశిత రుసుము చెల్లిస్తే సరిపోతుందని వివరించింది. ఉచితంగా ఆన్లైన్లో ఆధార్ వివరాలు అప్డేడేట్ చేసుకునేందుకు యూఐడీఏఐ తొలుత 2023 డిసెంబర్ 14 వరకు అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత దాన్ని రెండు దఫాల్లో జూన్ 14 దాకా పొడిగించింది.
ఆలోపు ఆన్లైన్లో తగిన పత్రాలు సమర్పించి ఉచితంగా వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు. ప్రతి పదేళ్లకోసారి ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోవాలని గతంలో యూఐడీఏఐ సూచించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com