Union Minister Gadkari : సహజీవనంపై కేంద్రమంత్రి గడ్కరీ వ్యాఖ్యలు వైరల్

సహజీవనం, స్వలింగ వివాహాలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఘాటు విమర్శలు చేశారు. సహజీవనం తప్పని, సమాజ నిబంధనలకు విరుద్ధ మని అన్నారు. స్వలింగ వివాహాలు సామాజిక నిర్మాణం పతనానికి దారితీస్తాయని గడ్కరీ హెచ్చరించారు. యూ ట్యూబ్ పోడ్కాస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. బ్రిటన్లో అతి పెద్ద సమస్య సహ జీవనమే అని, పెళ్లిని వ్యతిరేకించడం పెద్ద సమస్యగా మారినట్లు ఇటీవల బ్రిటీష్ పార్లమెంట్ వెళ్లినప్పుడు అక్కడ తమకు తెలిసిందన్నారు. ఒకవేళ మీరు పెళ్లి చేసుకోకపోతే, పిల్లల్ని కంటారని గడ్కరీ అడి గారు. ఒకవేళ పిల్లలు పుడితే, వాళ్ల భవిష్యత్తు ఏంటని ప్రశ్నించారు. సమాజ వ్యవస్థకు వ్యతిరేకంగా వెళ్తే, అది ప్రజలపై ఎటువంటి ప్రభావం చూపుతుందని ప్రశ్నించినట్లు తెలిపారు. సమాజం తనంతటే తాను నిర్ణయాలు తీసుకుంటుందని, కానీ దేశంలో లింగ నిష్పత్తి సమంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఉద్ఘా టించారు. ఒకవేళ 1500 మంది మహిళలు, 1000 మంది పురుషులు ఉంటే, అప్పు డు ఇద్దరు భార్యలకు పురుషులు అర్హులవుతారన్నారు. ఆదర్శ భారత దేశంలో విడాకుల్ని నిషేధించాల్సిన అవసరాన్ని ఆయన తిరస్కరించారు. సహజీవనం మంచిది కాదన్నారు. సేమ్ సెక్స్ మ్యారేజ్న వ్యతిరేకిస్తూ గత ఏడాది సుప్రీంకోర్టుకు చెందిన అయిదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో గడ్కరీ వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తించాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com