Resign : కేంద్ర మంత్రి పశుపతి కుమార్ రాజీనామా

కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమల శాఖ మంత్రి పశుపతి కుమార్ (Pashupati Kumar) తన పదవికి రాజీనామా చేశారు. ఎన్డీఏతో సీట్ల పంపిణీలో తలెత్తిన విభేదాలే ఆయన రాజీనామాకు కా రణమని తెలుస్తోంది. రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా కొనసా గుతోంది. పశుపతి కుమార్ ఆ పార్టీకి చీఫ్ గా వ్యవహరిస్తున్నారు. బీహార్ లో సీట్ల పంపకం విషయంలో తమ పార్టీకి తగిన ప్రాధాన్యం ఇవ్వ నందుకే ఎన్డీఏ నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నామని పశుపతి కుమార్ తెలిపారు.
ఈ నేపథ్యంలోనే తన మంత్రి పదవికి రాజీనామా చే సినట్టు చెప్పారు. తనకు మంత్రి పదవి ఇచ్చినం దుకు ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఎన్డీయే కూటమి నిన్న బిహార్‌లో సీట్ల షేరింగ్‌పై క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. 17 సీట్లలో బీజేపీ పోటీ చేయనుండగా, నితీష్‌కుమార్ సారథ్యంలోని జనతాదళ్ యూనైటెడ్ (JDU) 16 సీట్లలో పోటీ చేయనుంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే ఈ విషయాన్ని సోమవారం ప్రకటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com