Shivraj Singh : రైల్లో ప్రయాణించిన కేంద్రమంత్రి శివరాజ్ సింగ్

మధ్యప్రదేశ్ మామ మళ్లీ వార్తల్లోకి వచ్చారు. నిరాడంబర నేతగా పేరు తెచ్చుకున్న మధ్యప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.. అంతే సాదాసీదాగా పనులు చేపట్టి శెభాష్ అనిపించుకున్నారు. బీజేపీ మధ్యప్రదేశ్లో అధికారంలోకి రాగలిగిందని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటారు.
ఎప్పుడూ ప్రజల్లో ఉండే ఈయన ఇటీవలి మోడీ 3.0 మంత్రివర్గంలో మంత్రిగా చోటు సంపాదించుకున్నారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టినా తన తీరు మారలేదని నిరూపించుకున్నారు. ఢిల్లీ నుంచి భోపాల్ వరకు తన సతీమణితో కలిసి శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైలులో ప్రయాణించారు. తమతో కలిసి ప్రయాణిస్తున్న కేంద్ర మంత్రిని చూడగానే ప్రయాణికులు సంభ్రమాశ్చర్యలకు గురయ్యారు.
పలువురు ఆయనతో కరచాలనం చేసి సెల్ఫీలు తీసుకున్నారు. తన రైలు ప్రయాణం ఫొటోలను శివరాజ్ సింగ్ చౌహాన్ ( Shivaraj Singh Chouhan ) తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. మోదీ మార్గదర్శనంలో మంత్రి అశ్వినీ వైష్ణవ్ కృషితో భారతీయ రైల్వేల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని కొనియాడారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com