Arvind Kejriwal : సీఎం పదవి నుంచి తొలగించాలనడం అవివేకం : సుప్రీం
కేజ్రీవాల్ పై వ్యతిరేక పిటిషన్లపై సుప్రీంకోర్టు ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. కేజీవ్రాల్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని వేసిన పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం సోమవారం తోసిపుచ్చింది.
ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజీవ్రాల్ని ఈడీ, సీబీఐ అరెస్టు చేసి విచారణ చేస్తోంది. ఆయన ఇటీవలే బెయిల్ పై బయటకి వచ్చారు. అయితే జైలు శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి పదవికి అనర్హుడని పేర్కొంటూ కాంతి భాటీ అనే వ్యక్తి ఏప్రిల్లో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు.
పిటిషన్ విచారణకు హైకోర్టు నిరాకరించడంతో ఆయన సుప్రీం తలుపు తట్టారు. ఈ పిటిషన్ పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కేజీవ్రాల్ ను సీఎం పదవి నుంచి తొలగించాలని అడిగే చట్టపరమైన హక్కు పిటిషనర్ కు లేదని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దీంతో కేజీవ్రాల్ కు భారీ ఊరట లభించినట్టైంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com